మూడు వ్యవసాయ చట్టాలు రద్దు మూడు వ్యవసాయ చట్టాలు రద్దు - Repeal of three agricultural laws అత్యంత వివాదాస్పదమైన మూడు నూతు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది . సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19 న జాతినుద్దేశించి ఉద్దేశించి ప్రసంగిస్తూ ... 2020 సెప్టెంబర్లో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు . దేశంలోని చిన్న , సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని , అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు . 2021 నవంబర్ 29 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబందించిన రాజ్యాంగబద్ధ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు . వ్యవసాయ చట్టాలపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు . మూడు వ్యవసాయ చట్టాల వివరాలు 1 రైతు ఉత్పత్తుల వాణిజ్య , వ్యాపార ( ప్రోత్సాహక , సులభతర ) చట్టం 2020 : వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ( ఏపీఎంసీ ) మార్కెట్లకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను ( దేశంలో ఎక్కడైనా...