Skip to main content

Information and analysis of ancestral traits | పూర్వీకుల లక్షణాల సమాచారం మరియు విశ్లేషణ

 Information and analysis of ancestral traits

( పూర్వీకుల లక్షణాల సమాచారం మరియు విశ్లేషణలు)


మీరు .. మీ నాన్న గారు .. మీ తాత గారు .. ముత్తాత గారు .ఇక్కడి  దాకా ఓకే
 కానీ.......
ఇంకా ముందున్న పూర్వీకులు గురించి మీకు తెలుసా ? పోనీ మీకు ఎంత మంది పూర్వీకులు వున్నారో తెలుసా?
భూమి పై మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలు అయ్యింది . వందేళ్లకు మూడు తరాలు. అంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది  పూర్వీకులు వున్నారు .. ముత్తాత కు నాన్న .. ముత్తాత కు తాత .. ముత్తాతకు ముత్తాత .. ఇలా వెనక్కు వెళితే మొత్తం కోటి ఇరవై లక్షల తరాల చరిత్ర మీది .. నాది .. మనందరిది . 

మనిషి అయిదు వేల సంవత్సరాల క్రితం దాక అడవిలోనే నివసించాడు . అంటే మీ పూర్వీకుల్లో  ఒక కోటి పందొమ్మిది లక్షల ఎనబై అయిదు వేల మంది బతికింది అడవుల్లోనే. చివరి పదహైదు వేల  తరాల వారు మాత్రమే గుడిసెలు వేసుకొని స్థిరనివాసం ఏర్పరచుకొని గ్రామాల్లో బతికారు .

     అడవి లో  జీవనం అంటే చెట్లు చేమలు .. జంతువుల తో  సావాసం .. ఆ మాటకు వస్తే గుడిసెల్లో గ్రామీణ జీవనం కూడా ప్రకృతి లో జీవించడమే కదా?  . చెట్టు-  పుట్ట,  పురుగు-  పక్షి ఇలాంటి వాటికి దూరంగా బతికింది బతుకుతోంది .. మీరు లేదా మహా అంటే మీ నాన్నమాత్రమే . 

ఒక కోటి ఇరవై లక్షల తరాల్లో.. చివరి ఒకటి లేదా రెండు తరాలు దారి వేరు . అంతకు ముందు తరాలు అంటే 99 . 99 శాతం మానవ చరిత్ర ఒక ఎత్తు. 

జంతువుల మధ్య , చెట్ల మధ్య బతుకుతున్నప్పుడు సూక్ష్మ జీవులు మనిషి శరీరాన్ని తాకేవి . ఆ సూక్ష్మ జీవుల్లో మనిషి దేహానికి మంచి చేసేవి ఉంటాయి . కీడు చేసేవి ఉంటాయి . ఏది మంచి చేసేవి ? ఏది చెడు చేసేవి అని ఎలా తెలుస్తుంది . 

ఇప్పుడైతే ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ లు వచ్చాయి . బాక్టీరియా , వైరస్ ల గురించి తెలుసు . మరి మొదటి ఒక కోటి పందొమ్మిది ల్లక్షలా తొంబై తొమ్మిది వేల తొంబై ఎనిమిది తరాల సంగతి ? వారికి ఇవి మంచి బాక్టీరియా!  ఇవి  దేహానికి కీడు చేసేవి అని ఎవరు చెప్పారు ?

ఎవరో చెప్పనక్కర లేదు . ప్రకృతి ఆ ఏర్పాటు చేసింది . ప్రతి మనిషి దేహం లో రక్షణ వ్యవస్థ అంటే ఇమ్మ్యూనిటి సిస్టం ఉంటుంది . కాలగమనం లో మ్యుటేషన్ , డైరెక్షనల్ నాటురల్ సెలక్షన్ అనే పద్దతుల పరస్పర చర్య ల ద్వారా బలమైన ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఏర్పడింది . బలమైన ఇమ్మ్యూనిటి ఉన్న  వారే బతికారు . మనం అందరం ఆలా బతికిన వారి వారసులం . 

అంటే మనలోని ఇమ్మ్యూనిటి వ్యవస్థ చుట్టుపక్కల సూక్ష జీవుల తో సావాసం చేసేందుకు వీలుగా ఏర్పడింది . సూక్ష్మ  జీవుల్లో మనకు మంచి చేసేవి వున్నాయి . మన దేహం లో ముప్పై ట్రిలియన్ ల కణాలు ఉంటే అందుకు పది రెట్లు మొత్తం మూడు వందల ట్రిలియన్ ల బాక్టీరియా లు వున్నాయి . ఇవి మన దేహానికి అవసరం . అవి లేకుండా మనం బతకలేము . ఒక వంతు నువ్వు .. పది పాళ్ళు సూక్ష్మ  జీవులు .. ఇదీ నీ దేహం . 

    అలాగని అన్ని సూక్ష జీవులూ మంచి చేసేవి కావు . కీడు చేసే సూక్ష్మ జీవులను గుర్తించి మన రక్షణ వ్యవస్థ చంపేస్తుంది . అది ఆ విధంగా రూపొందింది . ఆ విధంగా దానికి పుట్టినప్పటి నుంచి .. కాదు కాదు పుట్టక ముందు నుంచి ట్రైనింగ్ ఉండేది .  

బిడ్డ  ఎలా పుడుతుంది ?  తల్లి గర్భం నుంచి జనన ద్వారం ద్వారా బయటకు వస్తుంది . కదా ? తల్లి గర్భం నుంచి శిశువు జనన  ద్వారం ద్వారా బయటకు వస్తుంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది . ఆ సమయం లో ఆ జనన  ద్వారం లో అంటే తల్లి యోని లో ఉన్న కొన్ని సూక్ష జీవులు బిడ్డ పై దాడి చేస్తాయి . అదిగో ఆలా భూమి పై పడక ముందే మనిషి సూక్ష్మ జీవుల తో పోరాటం మొదలు పెట్టేస్తాడు  . అందుకు తగ్గట్టు గా ఇమ్మ్యూనిటి వ్యవస్థ రూపొందింది . 

ఇప్పుడేమో తల్లి కడుపు కోసి బిడ్డ ను బయటకు తీస్తున్నారాయె . దీని వల్ల బిడ్డ తన తొలి బాటింగ్ ప్రాక్టీస్ ను మిస్ అవుతోంది  . తల్లి యోని ద్వారం లో వుండే సూక్ష జీవుల తో పోరాటం ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు తొలి మెట్టు . ఇది ఎంతో కీలకం  . సిజేరియన్ బిడ్డలకు ఈ అవకాశం ఉండదు . వారి ఇమ్మ్యూనిటి వ్యవస్థ పుట్టుకతో అంగ వైకల్యం తో పుట్టినట్టు లెక్క .

 పుట్టిన బిడ్డకు  తల్లి చను పాలు ఇస్తుంది . ఈ పాలల్లో బిడ్డ ఇమ్మ్యూనిటి వ్యవస్థ ను బలోపేతం చేసేవి ఉంటాయి . మంచి సూక్ష్మ జీవులు , చెడు చేసే సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి . ఇందువల్ల బిడ్డ ఇమ్మ్యూనిటి వ్యవస్థ కు రెండో బాటింగ్ ప్రాక్టీస్ .. రోజూ బాటింగ్ ప్రాక్టీస్ . ఇప్పుడేమో డబ్బా పాలు . అందులో సూక్ష్మ జీవులు వుండవు . అంటే ఇమ్మ్యూనిటి వ్యవస్థ కు ప్రాక్టీస్ లేదు . 

ఊరంతా ఒక దారి .. ఉలిపి కట్టెది ఒక దారి అని సామెత . నీ పూర్వీకులందరిది  ఒక దారి .. నీది మాత్రమే  ఒక దారి . నువ్వు చేస్తున్న పనులు నీకు గొప్ప .. కానీ నీ శరీరం లోని ఇమ్మ్యూనిటి వ్యవస్థ కు అవి అలవాటు లేనివి . దానికి నీ దేహం రెడీ గాలేదు . ఇది వాస్తవం . ఇదే అసలు సైన్స్ . 

పుట్టింది మట్టిలో .. బోళ్ల పడింది .. దోగాడింది.. లేచి నిలబడింది .. నడిచింది .. ఆడింది ... మట్టిలో .. పెరిగింది మట్టిలో , బతుకే మట్టిలో, మట్టి మనిషివి నీవు 
  ఇలా చేస్తున్నపుడు ప్రతి నిమషం...  ప్రతి రోజు .. సూక్ష్మ  జీవులు నీ శరీరం లో కి వెళ్ళేవి . అందులో మంచి చేసేవాటిని నీ శరీరం ఆహ్వానించేది . రండి .. రండి దయచేయండి అంటూ ఆహ్వానించేది . పీట వేసేది  ఆదిత్యం ఇచ్చేది . మన జీవ ప్రక్రియల్లో ఈ సూక్ష్మ జీవులు కీలక విధుల్ని నిర్వహిస్తాయి . అవి లేకుంటే మనం లేము . అదే సమయం లో దేహానికి కీడు చేసే సూక్ష్మ  జీవుల్ని గుర్తించి వెంటనే చంపేసేది మన ఇమ్మ్యూనిటి వ్యవస్థ . 

ఒకప్పుడు పచ్చి మాంసం తినే వారు . అందులో సూక్ష్మ జీవులు ఉండవా ? ఉంటాయి . దాని సంగతి ఇమ్మ్యూనిటి చూసుకొంటుంది . అటు పై వండిన వంటకాలు . అందులో పాసినవి ఉంటాయి . సద్ది అన్నం .. పులిసిన పెరుగు . ఇలా రోజూ .. బతికేది సూక్ష్మ జీవులతో .. తినేది సూక్ష జీవులను .. అదీ నీ చరిత్ర . అవున్నన్నా కాదన్నా ఇది నిజం . దీనికి అనుగుణంగా నీ దేహం రూపొందింది . 

ఆధునిక జీవి . తల్లి కడుపు కోసి బయటకు తీశారు .. స్టెరిలైజ్డ్ ఆపరేషన్ థియేటర్ . ఎక్కడా సూక్ష జీవులు వుండవు . అటు పై బాగా డెట్టాల్ తో శుభ్రం చేసిన రూమ్ .. డబ్బా పాలు .. అటు పై నెష్టం..  రూమ్ లో సూక్షం జీవులు వుండవు . సరే .. బయటకు బిడ్డ ను పంపేవా  ? గదిలో పెంపకం .. సోఫా .. టీవీ .. ఫ్రిజ్ నుంచి తీసిన ఆహారం .. స్టెరిలైజ్ చేసిన పాలు .. మట్టిలో ఆటలు లేవు .. ఇసుక గూళ్ళు కట్టడాలు లేవు . ఇదే ఆధునికత . 

మీ ఇంట్లో ఒక కుక్క వుంది . దానికి ఇంట్లో మనుషులు ఎవరో తెలుసు . అలాగే మీ బంధువులు వస్తే కూడా గుర్తు పడుతాయి . మొరగవు . కదా ? అదే కొత్త వారు ముఖ్యంగా అనుమానాస్పదం గా ఉన్న వారు  వస్తే .. మీద పడి రక్కేస్తాయి . అవునా ? కాదా ?

కుక్కకే అంత ట్రైనింగ్ ఇచ్చారు . మరి మీ ఇమ్మ్యూనిటి కి ట్రైనింగ్ ఎలా ? నీకు నచ్చినా నచ్చక పోయినా నీ చరిత్ర అంతా సూక్ష్మ  జీవుల తో సావాసం ఆయె . గడ్డి  మంచిది .. బంక మట్టి మంచిది .. తోటలో పుప్పొడి రేణువులు మంచివి . పాలు మంచివి .. వేరు శనిగ మంచిది అని దానికి తెలియాలి . తెలియకుండా పెంచితే ? మీ కుక్క మీ బంధువుల పై పడి రక్కేసినట్టే  మీ ఇమ్మ్యూనిటి ఏది మంచిదో ఏదో చెడు అని అర్థం చేసుకోకుండా పెరిగితే పాలు .. గడ్డి ఇలా హానికరకం కాని వాటిని కూడా హానికరకం అని అనుకోని రియాక్ట్ అవుతుంది . అదే ఎలర్జీ . ఫుడ్ ఎలర్జీ .. స్కిన్ ఎలర్జీ . గాడిద గుడ్డు ఎలర్జీ . తప్పేవాడిది  ?  చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలా వద్దా ? 

మీ కుక్క ను మీరు గదిలో కట్టేసి పెంచారు . దానికేమో బయటకు పోవాలని వుంది . మీరు  బయటకు వదలరు . దానికి పిచ్చి ఎక్కి మీ పైనే పడి రక్కేసింది . అదిగో అదే ఆటో ఇమ్యూన్ వ్యాధి . మీకు రక్షణ గా ఉండాల్సిన వ్యవస్థ ... హాని కారక జీవుల పై దాడి చేసి చంపాల్సిన వ్యవస్థ .. మీ శరీర అంగాల పై ..  గుండె .. ఊపిరి తిత్తులు , కిడ్నీ ఇలా ఒక్కో దాని పై దాడి చేసి  హాని కలిగించడమే ఆటో ఇమ్యూన్ వ్యాధి . చికిత్స లేదు . ఇది నాగరికత సాధించిన ఘనత . 

వాక్సిన్ లు అవసరమే .. స్మాల్ పాక్స్ .. పోలియో లాంటి ప్రాణాంతక వ్యాధులనుంచి మానవాళిని రక్షించాయి . అదే విధంగా ఆంటిబయోటిక్స్ కూడా . అదే సమయం లో వీటిని అతిగా వినియోగిస్తే ? వాక్సిన్ అంటే ఇమ్మ్యూనిటి వ్యవస్థ ను డూప్ చేయడం . ఆంటిబయోటిక్స్ ఎక్కువగా వాడితే శరీరం లోని మంచి చేసే బాక్టీరియా లు కూడా చనిపోతాయి . వాక్సిన్ అతి వినియోగం అంటే ఇమ్మ్యూనిటి తో చెలగాటమే . 

పిల్లల్ని పెంచి పెద్ద చేసే విధానం ... లాలి పాటలు .. జోల పాటలు ..చందమామ రావే .. జ్యో అచ్యుతానంద .. బెడ్ టైం స్టోరీస్  .. అనగనగ ఒక రాజు .. ఏడుగురు కొడుకులు .. గడ్డి మోపు ..  అమ్మ నాన్న .. అనురాగం . ఆప్యాయత, వన భోజనాలు , మూన్ లైట్ డిన్నర్లు  ఇవన్నీ గతం . వీడియో గేమ్స్ .. సెల్ ఫోన్ .. జంక్ ఫుడ్ .. లివ్ ఇన్ రిలేషన్షిప్.. విడాకులు .. అమ్మ నాన్న కీచులాటలు, గన్ కల్చర్  .. స్ట్రెస్ .. ఇవి వర్తమానం . ఇవి ఇమ్మ్యూనిటి ని ఎలా ప్రభావితం చేస్తాయో మరో పోస్ట్ లో వివరిస్తాను . అదే విధం గా ఏమి చెయ్యాలో కూడా ఆ పోస్ట్ లో చేబుతాను . తిరిగి అడవుల్లోకి వెళ్ళ లేము . పచ్చి మాంసం తినమని కాదు . చేయాల్సినవి .. చేయకూడనివి తరువాయి పోస్ట్ లో  .. దాన్ని మిస్ కాకండి 

దయ చేసి ఈ పోస్ట్ ను అందరితో షేర్ చేసుకోండి . నాకు క్రెడిట్స్ అక్కర లేదు . జనాలకు వాస్తవాలు తెలియాలి

 ☆ సర్వే జనా సుఖినోభవంతు ☆

Comments

Popular posts from this blog

How did autumn begin? | శరదృతువు ఎలా ప్రారంభమైంది ? | Latest Jobs Articles

 శరదృతువు ఎలా ప్రారంభమైంది ? ( How did autumn begin? ) రాజహంసలు పొందిన క్రౌంచపర్వత బిలము గలదై , వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై , యాజ్ఞికులచే చేయబడిన హోమ హవిస్సుతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించెడి లక్షీదేవి చేరిన కమలముగలదై మెలకువతో ఉన్న ఆది శేషునిపై పడుకున్న శ్రీమహా విష్ణువు సేవ కొఱకే అన్నట్లుగా వికసించిన ఎఱ్ఱ కలువలతో నిండిన సరస్సుగలదై శరధృతువు ప్రారంభమైనది.  శరదృతువులో ప్రకృతి ఎలా కన్పడింది ? ( What did nature look like in the fall?) శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి ? - శరత్కాలమనెడి స్త్రీ ఈ భూమికి ( దేవలోకం వలె ) అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై, వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసె ఎండును ; వికసించిన తెల్లతామరల, ఎర్రకలువల యొక్క పుప్పొడిని చెఱువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా ?  అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు . How are the autumn clouds?        The woman of autumn dries up most of the case after the monsoon clouds have parted, in order to add ambrosial equali...

Brihadeeswarar Temple History in Telugu | GK | Telugu Jobs Article's

 Brihadeeswarar Temple History in Telugu బృహదీశ్వర టెంప్ల్ ఇ ( పెరువుడైయార్ కోవిల్ ) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. దీనిని పెరియ కోవిల్, రాజరాజేశ్వర ఆలయం మరియు రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు . ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి మరియు చోళుల కాలంలో ద్రావిడ శిల్పకళకు ఉదాహరణ . చక్రవర్తి రాజ రాజ చోళ I చేత నిర్మించబడింది మరియు 1010 AD లో పూర్తయింది , ఈ ఆలయం 2010 లో 1000 సంవత్సరాల పురాతనమైనది . ఈ ఆలయం "గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు" అని పిలువబడే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం , మిగిలిన రెండుబృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం మరియు ఐరావతేశ్వర ఆలయం .  ఈ ఆలయం 16వ శతాబ్దంలో జోడించబడిన కోట గోడల మధ్య ఉంది. విమానం (ఆలయ గోపురం) 216 అడుగుల (66 మీ) ఎత్తు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఆలయం యొక్క కుంభం (పైభాగం లేదా గుబ్బల నిర్మాణం) ఒకే రాతితో చెక్కబడింది మరియు సుమారు 80 టన్నుల బరువు ఉంటుంది . ప్రవేశ ద్వారం వద్ద 16 అడుగుల (4.9 మీ) పొడవు మరియు 13 అడుగుల (4.0 మీ) ఎత్తు ఉన్న ఒకే రాతితో చెక్కబడిన నంది (పవిత్రమైన ఎద్దు) ...