మూడు వ్యవసాయ చట్టాలు రద్దు
మూడు వ్యవసాయ చట్టాలు రద్దు - Repeal of three agricultural laws
అత్యంత వివాదాస్పదమైన మూడు నూతు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది . సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19 న జాతినుద్దేశించి ఉద్దేశించి ప్రసంగిస్తూ ... 2020 సెప్టెంబర్లో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు . దేశంలోని చిన్న , సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని , అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు . 2021 నవంబర్ 29 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబందించిన రాజ్యాంగబద్ధ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు . వ్యవసాయ చట్టాలపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు .
మూడు వ్యవసాయ చట్టాల వివరాలు 1 రైతు ఉత్పత్తుల వాణిజ్య , వ్యాపార ( ప్రోత్సాహక , సులభతర ) చట్టం 2020 : వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ( ఏపీఎంసీ ) మార్కెట్లకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను ( దేశంలో ఎక్కడైనా సరే ) అమ్ముకునేందుకు ఇది స్వేచ్ఛనిస్తుంది . అలా చేసే విక్రయాలపై రుసుములేవీ విధించకూడదని స్పష్టం చేస్తోంది .
2 ధరల హామీ , వ్యవసాయ సేవలపై రైతుల ( సాధికారత , రక్షణ ) ఒప్పంద చట్టం -2020 : పండించబోయే పంట కొనుగోలుకు సంబంధించి వ్యాపార సంస్థలు , ప్రాసెసర్లు , ఎగుమతిదారులతో రైతులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది . పంట ధరను వారు ముందుగానే నిర్ణయించుకోవచ్చు . 3 నిత్యావసర సరకుల ( సవరణ చట్టం ) - 2020 : తృణధాన్యాలు , పప్పులు , నూనెగింజలు , ఉల్లి , బంగాళదుంప వంటి ఉత్పత్తులను నిత్యావసర సరకుల జాబితా నుంచి తొలగించాలని .. వాటి ఎగుమతులపై నిల్వ పరిమితి సంబంధిత ఆంక్షలు విధించకూడదని ఇది సూచిస్తోంది . యుద్ధం , కరవు , ప్రకృతి విపత్తులు , ధరల్లో అసాధారణ పెరుగుదల వంటివి తలెత్తినప్పుడే ఆ ఆంక్షలు విధించాలని పేర్కొంటోంది . చట్టాల రద్దు కోసం ఏడాదిపాటు రైతుల పోరాటం వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు తీసుకొచ్చిన ఈ మూడు వివాదాస్పద చట్టాలను 2020 జూన్లో ఆర్డినెన్స్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది . ఆర్డినెన్స్ల స్థానే తీసుకువచ్చిన బిల్లులు సెప్టెంబర్ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాక చట్టాలుగా మారాయి . కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు 2020 సెప్టెంబర్ 27 న రాష్ట్రపతి ఆమోదం లభించింది . వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో . రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు . దేశంలోని సుమారు 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ) పేరిట ఒకే గొడుగు కిందకు వచ్చాయి . బాష్పవాయు గోళాలు , నీటి ఫిరంగులు , లాఠీచార్జీలు , 2021 జనవరి 26 న జరిగిన హింసాకాండ , విచ్చలవిడి అరెస్టులు , రైతు నేతలపై , ప్రముఖ పాత్రికేయులపై ఎఫ్ఎఆర్లు , పర్యావరణ కార్యకర్తల అరెస్టులు వంటి పలు రకాల అణచివేతలను రైతులు ఎదుర్కొన్నారు . 90 రోజులపాటు లక్షల మంది రైతులు ఢిల్లీని ముట్టడించినా ఆ ముట్టడి ప్రశాంతంగా , ప్రజాస్వామ్యయుతంగా సాగింది .
ఇప్పటివరకు ఈ పోరాటంలో 750 మందికిపైగా రైతులు అమరులయ్యారు .
వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల పోరాటం కొన్ని సందర్భాల్లో హింసాత్మకంగా మారింది . వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా 2021 జనవరి 26 న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పిలుపునిచ్చారు . దానికోసం పోలీసుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకున్నారు . కానీ శాంతియుతంగా జరగాల్సిన ఆ ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారింది . కొంతమంది నిరసనకారులు బారికేడ్లను తోసుకొని .. తమకు అనుమతి లేని రహదారుల్లోకి దూసుకెళ్లారు . ఫలితంగా పోలీసులు , నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి . ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు . వందల మంది గాయపడ్డారు . క్షతగాత్రుల్లో పోలీసులు ఉన్నారు . ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు . నిరసనకారుల్లో కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించి .. దానిపై మతపరమైన జెండా ఎగరేయడం కలకలం సృష్టించింది . 2021 అక్టోబర్ 3 న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ భేరీలో శాంతియుతంగా
Comments
Post a Comment