ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ప్రభుత్వము విభిన్న ప్రతిభావంతుల ( వికలాంగుల ) బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన
KURNOOL DISTRICT BACKLOG POSTS NOTIFICATION 2021 - LATEST
Eligible candidates from Kurnool district are invited to apply online for the following posts reserved for the following categories: Must be submitted to the Assistant Directors, Diverse Talents, Hijra and Elderly Welfare Department, Collector Complex, Kurnool within 5.00 hrs (during office working days)
వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతుల ( వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ గ్ పోస్టులకై ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు అహ్వానించడమైనది . ధరఖాస్తులు స్వీకరించు తేది : 29.12.2021 నుండి 07 పనిదినాలు అనగా చివరి తేది : 04.01.2022 సాయంత్రం 5.00 గంటలలోపు ( కార్యాలయపు పని దినములలో ) సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభావంతులు , హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ , కలెక్టర్ కాంప్లెక్స్ , కర్నూలునకు సమర్పించవలెయును
డి.యస్.సి.పరిధిలోని ఉద్యోగాల సంఖ్య : ( 04 ) వాటికి అవసరమైన విద్యార్హతలు
KURNOOL DISTRICT BACKLOG NOTIFICATION 2021 - Rules for backlog application/ బ్యాక్ లాగ్ ధరఖాస్తుకు నియమావళి
Click Here - DOWNLOAD NOTIFICATIONS
➡️ వయస్సు 01.07.2021 నాటికి 18 సంవత్సరాలు పైబడి 52 సంవత్సరాలలోపు వున్న వారు మాత్రమే అర్హులు .
➡️ వికలత్వము : ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఒ.యం.యస్.నెం .31 స్త్రీ మరియు శిశు వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ తేది : 01.12.2009 ని అనుసరించి , సదరం ధృవీకరణ పత్రం మెడికల్ బోర్డుచే ధృవీకరించబడిన అంధులు మరియు శారీరక వికలాంగులకు 40 % మరియు ఆపైన వికలత్వము కలిగిన అభ్యర్ధులు , బధిరుల క్యాటగిరికి సంబంధించిన వారికి 51 % మరియు ఆ పైన వికలత్వము వున్న బధిరులు మాత్రమే అర్హులు ( PD Act . 2016 ) .
➡️ ఎంపిక ప్రక్రియ : పై తెలుపబడిన డి.యస్.సి.పరిధిలోని ఉద్యోగాలకు ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఒ. యం.యస్ . నెం . 74 సాధారణ పరిపాలన ( సర్వీసెస్ - ఎ ) డిపార్టుమెంటు తేది : 14.07.2007 ప్రకారమ సదరు ఉద్యోగానికి నిర్ధేశించబడిన విధ్యార్హతల నందు అత్యధిక మార్కుల శాతము పొందిన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది.
➡️ పై తెలుపబడిన డి.యస్.సి.పరిధిలోనికి రాని ఉద్యోగాలకు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిని క్రోడీకరించి నిర్దేశించిన వాటిలో అత్యధిక మార్కులు పొందిన వారు ఎంపిక చేయబడుదురు . వయస్సుకు 20 మార్కులు , వికలత్వానికి = 20 మార్కులు , ఎంప్లిమెంట్ సీనియారిటికి 10 మార్కులు , మొత్తం = 50 మార్కులకు .
➡️ మెరిట్ లిస్టు నందు 1 వ స్థానములో వచ్చిన వారిని వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డు , విశాఖపట్టణం వారికి ఖచ్చితమైన వికలత్వపు శాతమును నిర్ధారించుటకు పంపడము జరుగుతుంది . అట్టి అభ్యర్ధులకు ఎటువంటి టి.ఎ. , డి.ఎ. ఈ కార్యాలయము నుండి చెల్లించబడదు . అప్పిలేట్ మెడికల్ బోర్డు వారు ధృవీకరించిన వికలత్వపు శాతాన్ని పరిగణలోనికి తీసుకొని వారు పొందిన మార్కులు పెరగడం గాని తగ్గడం గాని జరగవచ్చు . అప్పిలేటు ట్రిబ్యూనలు / మెడికల్ బోర్డు వారు ధృవీకరించిన అంగవైకల్య శాతమునే పరిగణలోనికి తీసుకొని నియామకం చేయబడును .
➡️ వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డు , విశాఖపట్టణం వారి నుండి వచ్చిన రిపోర్టులో వికలత్వపు శాతము తగ్గినచో ( మెరిట్రిస్టు నందు వెయిటెజ్ మార్కులు తగ్గినచో ) తదుపరి వ్యక్తిని మెరిట్ ప్రతిపాదికన అప్పిలేట్ మెడికల్ బోర్డుకు పంపడము జరుగుతుంది .
➡️ విద్యా అర్హతల ధృవీకరణ పత్రములు కూడా సంబ అధికారులకు నిజ నిర్ధారణ కొరకు పంపడం జరుగుతుంది . ఇందులో విద్యార్హతల ధృవీకరణ పత్రములు నిజనిర్ధారణ రుజువు కాని యెడల అట్టి అభ్యర్ధి ధరఖాస్తును తిరస్కరించి తదుపరి వ్యక్తిని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది .
➡️ ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఒ.యం.యస్.నెం .52 ఎస్ఇటి డిపార్ట్మెంట్ , తేది : 19.04.2012 ప్రకారము ఉద్యోగ ప్రకటన తేదీ నాటికి అభ్యర్థులు తమ పేరును జిల్లా ఉపాధికార్యాలయము నందు నమోదు . చేసుకొని ఉండవలెయును
➡️ డి.యస్.సి. మరియు ఒ.డి.యస్.సి. పరిధిలోని ఉద్యోగాలకు అంధులు మరియు బధిరులైన వారు ఇతర జిల్లాలో ప్రత్యేక పాఠశాల నందు విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య . 104 , తేది : 24-3-2000 సాధారణ పరిపాలన ( యస్.పి.ఎఫ్.ఎ ) శాఖ ప్రకారము అంధుల మరియు బధిరుల స్థానిక నివాసము నిర్ణయించబడును . అభ్యర్ధి వారి తల్లి , తండ్రుల స్థానిక నివాస ధృవీకరణ పత్రము జత పరచవలెను .
➡️ డి.యస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలకు అంధులు 5 వ తరగతి / 7 వ తరగతి అర్హత లేకున్నా 10 వతరగతి నేరుగా చదివినట్లైయితే పైన పేర్కొన ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొన వచ్చును . కాని 5 వ తరగతి / 7 వ ఉన్న అభ్యర్థులు లభ్యము కాని పక్షమున మాత్రమే వీరి ధరఖాస్తులు ఎంపికకు పరిశీలించబడును .
➡️ పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఎంపిక ప్రాతిపదికనే కాకుండా ఎంపిక నాటికి ప్రభుత్వము వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు లోబడి ఉండును .
➡️ రూల్ ఆఫ్ రిజర్వేషన్ జనరల్ రూల్ 22 , ప్రభుత్వ ఉత్తర్వులు 2 స్త్రీ మరియు శిశు వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ తేది : 19.02.2020 ని అనుసరించి నిర్ధేశించడమైనది .
➡️ ఒకే అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన ప్రతి పోస్టునకు విడివిడిగా ధరఖాస్తు చేయవలెయును
➡️ ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానము ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు www.kurnool.ap.gov.in వుంచడమైనది . సదరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీ అర్హతలను సరిచూచికొని నియమ నిబంధనలకు లోబడి అభ్యర్ధులు అంతర్జాలము url address " srdaddwkni.ap.gov.in " నందు గుర్తులు వున్న వివరములను తప్పని సరిగా పూరించవలెను .
➡️ ( 1 ) అభ్యర్ధి పూర్తి పేరు . ( 2 ) తండ్రిపేరు . ( 3 ) పూర్తి చిరునామా ( పిన్కోడ్తో సహా ) . ( 4 ) ఏ విధమైన వికలాంగులు ( % తో సహా ) . ( 5 ) పుట్టిన తేది . ( 6 ) వయస్సు ( 01-07-2021 నాటికి 52 సంవత్సరములు లోపు ఉండవలయును ) , ( 7 ) విద్యార్హతలు : ( ఎ ) ధరఖాస్తు చేసుకొన్న ఉద్యోగానికి సంబందించిన అర్హత మార్కులు మాత్రమే ) . ( బి ) సాంకేతిక విద్యార్హతలు . ( 8 ) కులము ( 9 ) ఎంప్లాయిమెంటు కార్డు నెం . మరియు రిజిష్టర్ తేదితో పాటు ( 30-06-2021 ) నాటికి పూర్తి అయిన సంవత్సరాలు ) . ( 11 ) ఫోన్ నెం / సెల్ నెం . ( 12 ) నేటివిటి : ( అ ) స్వంత జిల్లా . ( బి ) 1 వ తరగతి నుండి 10 వ తరగితి వరకు చదివిన వివరాలు మరియు విద్యా సంవత్సరముతో పాటు పాఠశాల పేరు , చిరునామ మరియు ( 13 ) ఇతర వివరాలు , తప్పులు లేకుండా ఆన్లైన్ నందు పొందు పరచి సదరు ధరఖాస్తును ప్రింట్ రూపేణ తీసుకొని ధరఖాస్తుకు ఇటీవల తీయించిన పాస్పోర్ట్ సైజ్ ఒక ఫొటోను ధరఖాస్తుకు అతికించి , ముందు భాగంలో ఇంకుతో అభ్యర్ధి సంతకం చేయాలి మరొక ఫోటో ధరఖాస్తుకు పిన్ చేయాలి . ఆధార్ కార్డు , రేషన్ కార్డు , విధ్యార్హత ధృవీకరణ పత్రాలు , ఎంప్లాయిమెంట్ కార్డు , స్థిర నివాస ధృవీకరణ ( నేటివిటి ) , వైద్య ధృవీకరణ పత్రము ( సదరం ) తో పాటు బధిర అభ్యర్థులు అడియోగ్రామ్ చార్డు ( రిపోర్టు ) , ఇతర జిల్లాలో ప్రత్యేక పాఠశాల నందు విద్యనభ్యసించిన ( అంధులు మరియు బధిరులు ) వారి తల్లిదండ్రుల స్థిర నివాస ధృవీకరణ పత్రం జత చేసి గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి నిర్ణీత తేది : 04-01-2022 సాయంత్రం 5.00 గంటలలోపు సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభావంతులు , హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ , కలెక్టర్ కాంప్లెక్స్ , కర్నూలు వారికి అందేవిధంగా కవర్పై విభిన్న ప్రతిభావంతులు ( వికలాంగులు ) బ్యాక్ గ్ పోస్టుకు ధరఖాస్తు అని వ్రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా గాని , వ్యక్తి గతంగా కాని ఈ కార్యాలయమునకు అందజేయవలెయును . గడువు ముగిసిన తదుపరి సమర్పించబడే ఎలాంటి ధరఖాస్తులు , ధృవపత్రములు . స్వీకరించబడవు .
➡️ ఇది వరకే ప్రభుత్వ ఉద్యోగులైన అభ్యర్థులు ఈ ప్రకటననుసరించి ధరఖాస్తు చేసుకొనదలిచినచో వారిపై అధికారి యొక్క అనుమతి పత్రముతో మాత్రమే ధరఖాస్తు చేసుకొనవలెను . లేని యెడల దరఖాస్తు తిరస్కరించబడును .
➡️ పై తెల్పిన పోస్టులు సందర్భానుసారంగా లభ్యతను బట్టి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును లేదా ప్రకటన రద్దు చేయుటకు సర్వ అధికారములు జిల్లా కలెక్టర్ , కర్నూలు వారికి కలవు .
➡️ తప్పుడు సమచారం / ధృవపత్రాలు సమర్పించిన వారిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు చేపట్టబడునని గ్రహించేది మరియు నియామకం ఎదేని జరిగిన యెడల అది రద్దు పరచబడును .
➡️ పైన పేర్కొనబడిన వివరములు అన్నియు నాకు తెలిసినంత వరకు యదార్థతమైనవి . వీటిలో ఏమైనా అసత్యమని తేలినచో మీచే గైకొనబడు ఎలాంటి చర్యకైన బాధ్యత వహించెదను అని వ్రాసి అభ్యర్ధి సంతకం తప్పని సరిగా కుడివైపు క్రింది భాగము నందు చేయవలెయును .
జిల్లా కలెక్టర్ కర్నూలు
Comments
Post a Comment